Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతురు శీలాన్ని కాటేసిన కన్నతండ్రి.. ఎక్కడ?

Advertiesment
కూతురు శీలాన్ని కాటేసిన కన్నతండ్రి.. ఎక్కడ?
, సోమవారం, 29 మార్చి 2021 (14:13 IST)
కామంతో కళ్ళుమూసుకుపోయిన ఆ కామాంధ తండ్రి.. కన్నబిడ్డ అని కూడా చూడకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా సాగుతూ వచ్చిన ఈ వ్యవహారం.. ఇటీవల ఆ యువతి గర్భందాల్చడంతో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వర్కాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను డిండిలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదివిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడంతో ఆ బాలిక గత యేడాది కాలంగా ఇంటివద్దే ఉంటోంది. 
 
ఈ క్రమంలోనే వయస్సుకొచ్చిన ఆ బాలికపై కన్నతండ్రి కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా లోబర్చుకున్నాడు. ఈ విషయం బయటికి చెప్పొద్దంటూ, చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెతో లైంగికవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఇటీవల ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఏమీ ఎరుగనట్లు భార్యతో కలసి కూతురును దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చేసిన వైద్య పరీక్షల్లో బాలిక గర్భందాల్చినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ విషయం తెలిసిన తల్లి షాక్‌కు గురై మౌనంగా రోధిస్తూ బిడ్డను ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వచ్చాక కుమార్తెను నిలదీయగా తండ్రి చేసిన నిర్వాకాన్ని వెల్లడించింది. ఆ తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తల్లీకూతుళ్లను శనివారం రాత్రి ఇంట్లోనే బంధించి చితకబాదాడు. 
 
ఆ దెబ్బలను తట్టుకోలేకపోయిన ఆ బాలిక బిగ్గరగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగులు తీసి... ఇరుగుపొరుగువారికి చెప్పింది. వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి ఎస్‌ఐ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరి ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు!