Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి స్వదేశీ విమాన వాహక నౌక ట్రయల్స్ ప్రారంభం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (17:17 IST)
భారత రక్షణ శాఖ మరో అరుదైన ఫీట్‌ను సాధించింది. తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్‌ నేవీ అంబులపొదిలో చేరేందుకు సిద్ధమవుతుంది. ఈ భారీ విమాన వాహక నౌక తొలి సముద్ర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 
 
మొత్తం 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్‌ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది. దీంతో విమాన వాహక నౌకల తయారీ, రూపకల్పన దేశాల సరసన భారత్‌ చేరినట్లయ్యింది.
 
కాగా, ఐఎస్‌ఎస్‌ విక్రాంత్‌ తొలి సముద్ర పరీక్షలు దేశం గర్వించదగిన చారిత్రక ఘట్టంగా భారత నౌకాదళం అభివర్ణించింది. 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు 2014లో వీడ్కోలు పలికారు. 
 
కాగా, 1971 ఇండో-పాక్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించి 50 ఏండ్లకు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పునర్జన్మ పొందినట్లు నేవీ ట్వీట్ చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి కాల భైరవ పాడిన బుజ్జి మేక సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments