భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 24నే ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయని ఏఎన్ఐ స్పష్టం చేసింది. గత నెలలోనే ఈ టీ20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా ఒమన్, యూఏఈల్లో జరగనుందని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే.
2019 ప్రపంచకప్‌లో భారత్ చివరిసారిగా అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌తో తలపడింది. అక్కడ విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది.