Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకాకు భయపడి నదిలో దూకి పారిపోయిన గ్రామస్థులు

Webdunia
సోమవారం, 24 మే 2021 (14:03 IST)
కొవిడ్ టీకా వేస్తారనే భయంతో పారిపోయిన గ్రామస్థుల విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. దేశంలో ఒకవైపు కొవిడ్-19 టీకాల కోసం జనం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతుండగా, మరో వైపు వ్యాక్సిన్ వేసేందుకు గ్రామానికి వచ్చిన అధికారుల బృందాన్ని చూసి నదిలో దూకి పారిపోయిన గ్రామస్థుల ఉదంతం యూపీలోని బారాబంకీ గ్రామంలో జరిగింది.

బారాబంకీ గ్రామవాసులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. అంతే కొవిడ్ టీకాల నుంచి తప్పించుకోవడానికి గ్రామస్థులు గ్రామ ఒడ్డున ఉన్న సరయూ నదిలోకి దూకి ఈత కొడుతూ గ్రామం నుంచి తప్పించుకొని పారిపోయారు.

ఈ విచిత్ర సంఘటన  రామ్ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ చెప్పారు.బారాబంకీ గ్రామంలో కొవిడ్ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి డివిజనల్ మెజిస్ట్రేట్ వివరించి చెప్పి గ్రామస్థులకున్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు.

దీంతో  గ్రామంలో ఎక్కువ మంది నదిలో దూకి పారిపోగా, కేవలం 14 మంది మాత్రమే కొవిడ్ టీకాలు వేయించుకున్నారు.ఇది కొవిడ్ టీకా కాదని, విషపూరితమైన ఇంజెక్షన్ అని కొంతమంది చెప్పినందున గ్రామస్థులు నదిలోకి దూకి పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న తరుణంలో బారాబంకీ గ్రామస్థులు తమకు టీకాలు వద్దని పారిపోవడం సంచలనం రేపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments