Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్‌ వ్యాపారి కారుకు ప్రెస్‌ స్టిక్కర్‌

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:57 IST)
లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆంక్షల సడలింపుల్లో ఉన్న ‘ప్రెస్‌’ను తమకు అనుకూలంగా వాడుకుంటున్న ఉల్లంఘనులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు.

కారుకు  ప్రెస్‌ స్టిక్కర్‌ పెట్టుకుని లాక్‌డౌన్‌ సమయంలో దర్జాగా తిరుగుతున్న చికెన్‌ వ్యాపారిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన బొమ్మగాని ఉపేందర్‌ చికెన్‌ వ్యాపారి. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో తన సొంతకారు (టీఎస్‌ 09 ఈఎఫ్‌ 4174)కు ప్రెస్‌ స్టిక్కరు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు.

గురువారం రాత్రి చిలకలగూడ పోలీసులు సీతాఫల్‌మండి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉపేందర్‌ తన కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపగా రిపోర్టర్‌ను అంటూ దబాయించాడు. ఏ పత్రికలో పనిచేస్తున్నావో ఐడెంటిటీ కార్డు చూపించమని కోరగా నీళ్లు నమిలాడు.

వాస్తవానికి తాను చికెన్‌ వ్యాపారినని, లాక్‌డౌన్‌ సమయంలో సడలింపు ఉండడంతో తన కారుకు ప్రెస్‌ స్టిక్కర్‌ అతికించానని వివరించాడు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించినందుకు కారును సీజ్‌ చేయడంతోపాటు జరిమాన విధించారు.

ప్రెస్‌ పేరిట మోసానికి పాల్పడిన ఉపేందర్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్‌ వివరించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments