Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్రాస్ మాజీ జడ్జి సీఎస్ కర్ణన్ అరెస్టు!

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:02 IST)
మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి సీఎస్‌ కర్ణన్‌ బుధవారం అరెస్ట్‌ అయ్యారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు యూట్యూబ్ వీడియోల ద్వారా బహిర్గతమైంది. 
 
మహిళా జడ్జీలతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల భార్యల పరువునకు నష్టం కలిగేలా, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ రూపొందించిన వీడియోలను కర్ణన్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. 
 
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల భార్యలపై ఆయన అప్రియంగా పరువు నష్టం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ న్యాయమూర్తి కర్ణన్‌పై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చెన్నై పోలీసులపై మండిపడింది. దీంతో మాజీ న్యాయమూర్తి కర్ణన్‌ను చెన్నై పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. 
 
కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి పరారైన కర్ణన్‌ను జూన్ 20న కోయంబత్తూరులో సీఐడీ అరెస్టు చేసింది. పరారీలో ఉండగా రిటైరైన తొలి హైకోర్టు జడ్జిగా కర్ణన్ రికార్డులకెక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments