Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం, భార్యకు ఎయిడ్స్ వచ్చిందనీ...

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (16:55 IST)
ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే భార్య చిన్ననాటి స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకుని తన జీవితాన్ని నిలువుగా నాశనం చేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులు ఇప్పుడు అనాధల్లా మిగిలిపోయారు. 
 
కర్ణాటక రాష్ట్రం హవేరిజిల్లా రణబెన్నూర్ ప్రాంతానికి చెందిన నవీన్‌కి లతతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి స్వస్థలం అనంతపురంజిల్లా పుట్టపర్తి. ఉపాధి లేక బెంగుళూరుకు వలస వెళ్ళారు. వీరికి ప్రస్తుతం ఏడు సంవత్సరాల కొడుకు, ఆరు సంవత్సరాల కూతురు ఉన్నాఉ. 
 
నవీన్ సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. లత ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే గత రెండు నెలల నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన లత చిన్ననాటి స్నేహితుడు రాజేష్‌తో ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. లత ఇంటికి సమీపంలోనే రాజేష్ ఉండేవాడు. ఉద్యోగం కోసం బెంగుళూరుకు వచ్చాడు.
 
లతకు మాయమాటలు చెప్పి చివరకు రాజేష్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. భార్యలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన నవీన్ ఆమెకు హెచ్ఐవి టెస్ట్ చేయించాడు. దీంతో ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. కోపంతో రగిలిపోయిన నవీన్ నిన్న రాత్రి నిద్రిస్తున్న లతను అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి చనిపోయి, తండ్రి పరారీలో ఉండడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments