Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వీధిలోనే బ్యూటిఫుల్ జంట, కానీ తెల్లారేసరికి భార్య ఆత్మహత్య, ఏమైంది?

Advertiesment
ఆ వీధిలోనే బ్యూటిఫుల్ జంట, కానీ తెల్లారేసరికి భార్య ఆత్మహత్య, ఏమైంది?
, మంగళవారం, 1 డిశెంబరు 2020 (17:27 IST)
ఇద్దరికి 30 యేళ్ళు దాటాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. సంసార జీవితంలో మొదట్లో బాగానే గడిపారు. పెళ్ళయి సంవత్సరం అయ్యింది. ఇప్పుడు భార్య గర్భవతి. కానీ భార్యాభర్తలిద్దరికీ ఇప్పుడు పడటం లేదు. తన భర్త తాను చెప్పినట్లు వినడం లేదని.. శృంగారం చేయడం లేదని బాధపడుతూ ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 
 
నల్గొండజిల్లా చండూరు ప్రాంతమది. దిలీప్‌కి 35 సంవత్సరాలు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా చదువుకున్నాడు. పెళ్ళి కోసం అమ్మాయిని వెతుకుతూ ఒక మేరేజ్ బ్యూరోను సంవత్సరం క్రితం కలిశాడు. ఆన్‌లైన్ లోనే పెళ్ళిచూపులు మొదలెట్టాడు. నల్లగొండ సిటీలోనే ఉన్న ఒక యువతి నెంబర్ ఇచ్చారు మేరేజ్ బ్యూరో. 
 
ఇక ఆ యువతితో మాట్లాడటం మొదలుపెట్టాడు. బి.టెక్ పూర్తి చేసింది యువతి. ఆమెను సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నాడు. కరోనా కావడంతో తన సొంత గ్రామానికి వచ్చి కాపురం పెట్టాడు. మొదట్లో బాగా సాగిపోయిన కాపురం. ఇద్దరూ కలిసి హాయిగా ఉండేవారు. వారు నివాసమున్న వీధిలో జంట అంటే ఇలా ఉండేవారని చెప్పుకునేవారు. 
 
కానీ గత రెండు నెలల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవల జరుగుతూ ఉండేవట. కరోనావైరస్ కారణంగా ఉద్యోగం లేకుండా దిలీప్ ఇంటి పట్టునే ఉండడం.. భార్యతో సఖ్యతగా లేకపోవడం ఆమెకు నచ్చలేదట. అంతేకాదు తనతో శృంగారం కూడా భర్త సరిగ్గా చేయడం లేదని తన స్నేహితులతో ఫోన్ చేసి మరీ చెప్పుకుందట.
 
భర్తకు ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. దీంతో ఇంట్లోనే నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు కారణాలను ఒక లేఖలో రాసి చనిపోయిందట. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బురేవి' తుఫాను వచ్చేస్తోంది.. 65కిమీ వేగంతో గాలులు.. అతి భారీ వర్షాలు