Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిడ్డను చూసేందుకు వచ్చిన భర్త హత్య.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!

Advertiesment
బిడ్డను చూసేందుకు వచ్చిన భర్త హత్య.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!
, శుక్రవారం, 27 నవంబరు 2020 (06:45 IST)
నాలుగు నెలల క్రితం జన్మించిన మగబిడ్డను చూసేందుకు వచ్చిన ఓ భర్త.. కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ధారుణం కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షత అనే మహిళకు హావేరి జిల్లా హానగల్‌ నివాసి జగదీష్‌తో ఒక ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం అక్షతకు ఓ మగబిడ్డ జన్మించింది. ఈ క్రమంలో భార్య, బిడ్డలను చూడటానికి వచ్చిన భర్త దారుణ హత్యకు గురయ్యాడు.  
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, అక్షత కాల్‌ డేటాను తెలుసుకొని ఆమె ప్రియుడు కాశప్పను అదుపులోకి తీసుకుని పోలీసు పద్ధతిలో విచారించగా అసలు విషయం నిగ్గు తేలింది. 
 
బాదామి తాలూకా బండకేరి అనే గ్రామానికి చెందిన కాశప్ప ఐదేళ్ల నుంచి కేఈబీ లైన్‌మెన్‌గా ఉంటూ అంచటగేరిలో అక్షత ఇంటి ఎదుట ఇల్లు తీసుకొని నివసించసాగాడు. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అక్షితకు యేడాదిన్నర క్రితం పెళ్లికాగా, కాశప్పకు నాలుగు నెలల క్రితం మరో యువతితో వివాహమైంది.
 
అయితే, అక్షితతో ఉన్న వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న భర్త జగదీష్‌ను చంపేయాలని ఇద్దరూ పథకం వేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్‌కు మంగళవారం కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు చివరలోని చెన్నాపుర క్రాస్‌ వద్ద తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేసి పరారయ్యాడు. కొన్ని గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు గురువారం నిందితులను జుడీషియల్‌ కస్టడీకి అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఐటీ రంగ పితామహుడు కోహ్లీ ఇకలేరు!