Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదు నక్షత్రాల హోటల్‌లో ఈవెంట్ మేనేజరుపై బలాత్కారం.. ఎక్కడ?

Advertiesment
ఐదు నక్షత్రాల హోటల్‌లో ఈవెంట్ మేనేజరుపై బలాత్కారం.. ఎక్కడ?
, సోమవారం, 23 నవంబరు 2020 (18:59 IST)
దేశ రాజధానిలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతోంది. కేవలం వీధులు, రోడ్లపైనే కాదు.. ఏకంగా ఫైవ్‌స్టార్ హోటళ్ళలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఈవెంట్ మేనేజరుపై బలాత్కారం జరిగింది. ఆమె వయసు 27 యేళ్లు. ఈమెపై ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ అత్యాచారం చేశాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రానికి చెందిన మెహతా (57) అనే వ్యక్తి ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ అయ్యాడు. ఆయనతో పాటు అతని స్నేహితుడు నవీన్ ద్వార్‌ (46)ను నవంబర్ 18, 19 తేదీల్లో ఆమె కలుసుకుంది. నవంబర్ 19న పనులు ముగించుకుని కన్నాట్ ప్లేస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు వారు తిరుగుపయనమయ్యారు. 
 
ఈ మార్గమధ్యంలో ఆమెతో ద్వార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత హోటల్ బయట బాధితురాలిని, మెహతాను వదిలేసి వెళ్లిపోయాడు. హోటల్‌లోకి వెళ్లిన తర్వాత ఆమెపై మెహతా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆనంద్ విహార్ ప్రాంతంలో ఆమెను వదిలేసి పరారయ్యాడు.
 
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. 
 
అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు మిక్కీ మెహతా (57), నవీన్ ద్వార్ (46) ఢిల్లీలోని లజపత్ నగర్ మరియు సాకేత్ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో వీరిద్దరూ ఒక దాబాను నడుపుతున్నారని చెప్పారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం