Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టీరింగ్‌కు ముద్దుపెట్టి... బస్సు ముందుభాగాన్ని హగ్ చేసుకుని.. ఓ డ్రైవర్ భావోద్వేగం

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:22 IST)
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషలో మీడియాలో వైరల్ అయింది. తనకు ఆ బస్సుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన చివరి పనిదినమైన తన రిటైర్మెట్ డే రోజున ఆ డ్రైవర్ చేసిన పనికి ప్రతి ఒక్క నెటిజన్ హృదయాన్ని కదిలిస్తుంది. ఈ వీడియోలో డ్రైవర్ భావోద్వేగాన్ని చూసిన నెటిజన్ల కళ్లు కూడా చెమర్చుతున్నాయి. తన చివరి పనిదినం రోజున స్టీరింగ్, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్‌లను తాకి ముద్దాడిన డ్రైవర్... బస్సు దిగి దాని ముందు భాగాన్ని హత్తుకుని దండం పెట్టి కన్నీటిపర్యంతమయ్యారు. 
 
ఆ డ్రైవర్ పేరు ముత్తుపాండి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలో పని చేస్తున్నారు. తన ఆఖరి పనిదినం రోజున చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టారు. స్టీరింగ్‌ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్, చక్రాలు ఇలా అన్ని భాగాలను తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోని కిందికి దిగారు. 
 
పుట్‌బోర్డుకు నమస్కరించి, బస్సు ముందుకు వచ్చారు. సంవత్సరాల తరబడి బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితో బస్సును హగ్‌ చేసుకున్నారు. నేటితో తమ బంధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదంతా తోటి ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments