Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పుష్ప' చిత్ర యూనిట్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం

Advertiesment
bus accident
, బుధవారం, 31 మే 2023 (10:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". గతంలో విడుదలైన తొలి భాగం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇపుడు రెండో భాగం తెరకెక్కుతుంది. అయితే, ఆ చిత్రం కోసం పని చేస్తున్న కొందరు ఆర్టిస్టులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. 
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, నార్కట్ పల్లి వద్ద ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించారు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా పాలిట నా తండ్రి విలన్ అని చెప్పనుగానీ... : వనితా విజయకుమార్