తిరుమల నుంచి దిగువ తిరుపతికి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్ద బోల్తా పడింది. బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవరుతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది లోయలో పడిన బస్సును గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలు పగులగొట్టి భక్తులను రక్షించారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వార్తను తెలుసుకున్న తితిదే ఈవో విచారణకు ఆదేశించారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులను ఘాట్ రోడ్లలో తిప్పుతుండగా ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న వారితో అధికారులు మాట్లాడారు.