Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరి మృతిని జీర్ణించుకోలేని సోదరుడు.. చితిలో దూకేశాడు..

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:08 IST)
తనకు వరుసకు సోదరి కజిన్ సిస్టర్ మృతి చెందడాన్ని ఓ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమె చితి మంటల్లో దూకి ప్రాణత్యాగం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు అతన్ని ఇతరులు రక్షించగా, కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మణక్యా గ్రామానికి చెందిన 25 యేళ్ల యువకుడు సుఖ్‌దేవ్ భిల్‌ కజిన్ సిస్టర్ చనిపోయింది. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే, ఆమె మృతిని జీర్ణించుకోలేని భిల్.. ఆమె చితి మంటల్లో దూకేశాడు. అతను మంటల్లో దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు గుర్తించి రక్షించి, ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. అయితే, ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. 
 
ఈ ఘటనపై భివారా అడిషినల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా స్పందిస్తూ, భిల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని, ప్రస్తుతం అతను 95 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments