Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఇంటి విలువ ఎంతో తెలుసా?

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (17:43 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఆమె బుధవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువ రూ.12 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో రూ.4.24 కోట్ల చరాస్తులు, రూ.7.74 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. ఎన్నికల సంఘానికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాలను పరిశీలిస్తే, 
 
తనకు ఉన్న రూ.12 కోట్ల విలువైన ఆస్తిలో రూ.4.24 కోట్ల విలువ చేసే చరాస్తులు, రూ.7.74 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. మూడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోడా సీఆర్వీ కారు, రూ.1.15 కోట్ల విలువైన 4 కిలోలకు పైగా బంగారు నగలు ఉన్నట్టు చూపించారు. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని మొహ్రాలీ ప్రాంతలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్‌లో సంగ వాటా ఉన్నట్టు వెల్లడించారు. సిమ్లాలోని తన పేరిట రూ.5.63 కోట్ల విలువైన ఓ నివాస భవనం ఉందని పేర్కొన్నారు. 
 
గత ఆర్థిక సంవత్సరంలో తన వార్షిక ఆదాయం రూ.46.39 లక్షలుగా ఉందని, తన భర్త రాబర్ట్ వాద్రా నికర ఆస్తుల విలువ రూ.65.54 కోట్లుగా ఉన్నట్టు ప్రియాంకా గాంధీ వెల్లడించారు. ఇందులో రూ.37.9 కోట్ల చరాస్తులు, రూ.27.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

క సినిమాలో ఎలిమెంట్ గతంలో చూశామని అనిపిస్తే సినిమాలు ఆపేస్తా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments