అమరావతి రైల్వే లైన్‌కు తొలి అడుగులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలను పెంపొందించే క్రమంలో, రాష్ట్ర నూతన రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంతకుమునుపే ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీని మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని పెంచడం లక్ష్యంగా కేంద్రం రూ.2,245 కోట్లు కేటాయించింది.
ఈ కొత్త రైలు మార్గం 57 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు.