Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఫెల్ యుద్ధ విమానాలు భారతగడ్డను ముద్దాడితే... పొరుగు దేశాల్లో ప్రకంపనలు

Webdunia
గురువారం, 30 జులై 2020 (15:09 IST)
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా తొలి దశలో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టాయి. ఈ డీల్‌లో భాగంగా మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకోగా, తొలి విడతగా నేడు ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఐదు విమానాలు బుధవారం మధ్యాహ్నం భారత గడ్డను ముద్దాడాయి. దీంతో యావత్ భారత్ పులకించిపోయింది. 
 
దీనిపై భారత క్రికెటర్ మనోజ్ తివారీ చమత్కారంతో కూడిన ఓ ట్వీట్ చేశారు. భారత్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టిన వెంటనే పొరుగు దేశాల్లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించిందంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటగా తాజాగా మనోజ్ తివారీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 
 
రాఫెల్ విమానాలు భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయన్నారు. ఈ విమానాల రాకతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగిందని, ఇకపై పొరుగు దేశాల నుంచి రెచ్చగొట్టడాలు ఉండవని పేర్కొన్నాడు.
 
అంబాలాలో ఇవి ల్యాండ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా అంబాలా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒప్పందంలో భాగంగా మిగతా విమానాల్లో మరికొన్ని ఆగస్టులో రానున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments