బెంగళూరులో భారీ శబ్ధం.. అంతుపట్టలేకపోయారు.. బూమ్ అంటూ..?

బుధవారం, 20 మే 2020 (15:42 IST)
బెంగళూరులో భారీ శబ్ధం జనాలను వణికిపోయేలా చేసింది. బెంగళూరులో నివసించే ప్రజలు ఈ శబ్ధాన్ని విని జడుసుకున్నారు. బుధవారం పూట బూమ్ అంటూ ఏర్పడిన ఈ శబ్ధాన్ని విన్నవారంతా సోషల్ మీడియాలో తమ అనుభవాన్ని పంచుకున్నారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఈ శబ్ధం వినిపించింది. వెంటనే తలుపులు, కిటికీలను మూసేశారు.
 
 
ఐదు సెకన్ల పాటు వినిపించిన ఈ శబ్ధం విని భూకంపం వచ్చిందేమోనని అనుకున్నారట. ఈ శబ్ధం బెంగళూరులోని కుకీ టౌన్, వివేక్ నగర్, రామమూర్తి నగర్ హోసూర్ రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వినిపించిందట. ఈ పెద్ద శబ్ధం ఎందుకు వినిపించిందనే దానిరి దర్యాప్తు జరుపుతున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు. 
 
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు మాట్లాడుతూ అంతుబట్టని భారీ శబ్దంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏదైనా యుద్ధ విమానం ప్రయాణించిందా? అనే అంశంపై వాయు సేనను వివరణ కోరినట్లు తెలిపారు. ప్రజలు ఈ శబ్దాన్ని విన్నారని, దీనిపై స్పందిస్తూ, యుద్ద విమానం కదలికల గురించి వాయు సేనను ఆరా తీశామని తెలిపారు. 
 
బెంగళూరు నగరవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమల్లో ఉంది. ఈ సమయంలో బుధవారం రాత్రి 1.45 గంటలకు వినిపించిన శబ్దం గురించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వివరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నగరంలో బుధవారం భూకంపాలేవీ నమోదు కాలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సైబర్ కేటుగాళ్లున్నారు జాగ్రత్త- పేటీఎం పాపం.. రూ.10 రీచార్జ్ అంటూ లక్ష టోకరా