Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆహార నిల్వలు ఎంత ఉన్నాయో తెలుసా?

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (21:00 IST)
మరో ఏడాదిన్నర పాటు పేదలకు కావలసిన ఆహార ధాన్యాలకు ఇబ్బంది లేకుండా దేశవ్యాప్తంగా రిజర్వులో ఉన్నాయని వెల్లడించారు పుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా ఛైర్మన్​ డి. వీ. ప్రసాద్​. అంతే కాకుండా ఏప్రిల్​ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్​ టన్నుల ఆహార ధాన్యాలు ఉంటాయని స్పష్టం చేశారు.

భారత్‌లోని పేదలకు మరో ఏడాదిన్నర పాటు ఆహారధాన్యాలకు ఇబ్బంది లేకుండా రిజర్వులు ఉన్నాయని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డి.వి.ప్రసాద్‌ తెలిపారు. ఏప్రిల్‌ చివరి నాటికి ప్రభుత్వ గోదాముల్లో దాదాపు 100 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలు ఉంటాయని తెలిపారు.

మన దేశంలో పేదల వార్షిక అవసరాలకు 50 మిలియన్‌ టన్నుల నుంచి 60 మిలియన్‌ టన్నులు సరిపోతాయని ప్రసాద్‌ వెల్లడించారు. 2019-20 వార్షిక సంవత్సరానికి భారత్‌ రికార్డు స్థాయిలో 292 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేస్తుందని అంచనాలు ఉన్నాయి.

వాస్తవానికి గత ఏడాది కంటే ఈ సారి అధికంగా పండనున్నాయి. ఆహార ధాన్యాల కొరతగురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రసాద్‌. దేశంలోని అన్ని ప్రాంతాలకు అవసరమైన గోదాములు, బియ్యం ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజా పంపిణీ ద్వారా ఆహార ధాన్యాలు పొందుతున్న వారు 6 నెలలకు సరిపడా ముందే కొనుగోలు చేసుకోవచ్చని ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments