సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్‌గా ఉండే ప్రధాని మోదీ.. వచ్చే ఆదివారం నుంచి సోషల్ మీడియాను వీడాలనుకుంటున్నట్లు చేసిన ప్రకటన దేశంలో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
మోదీ ప్రకటనపై పలువురు రాజకీయ ప్రముఖులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించే దిశగా వేస్తున్న తొలి అడుగే మోదీ ప్రకటన అంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ఆరోపించారు.
మంచితో పాటు, ఉపయోగకరమైన సందేశాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయనే విషయం ప్రధానికి కూడా తెలుసని అన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక మంది వ్యక్తులు ఫాలోవర్స్ ఉన్న వ్యక్తుల్లో మూడవ స్థానంలో ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అనుమానంగా ఉందన్నారు.
ఇక ప్రతిపక్ష నేత అదీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకే సోషల్ మీడియాను మోదీ వీడుతున్నారని విమర్శించారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.