Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా ఎఫెక్ట్: నేటి నుంచి దేశ సరిహద్దుల మూసివేత

కరోనా ఎఫెక్ట్: నేటి నుంచి దేశ సరిహద్దుల మూసివేత
, ఆదివారం, 15 మార్చి 2020 (09:04 IST)
కరోనా వైరస్ నిర్ధారిత కేసుల సంఖ్య  దేశంలో రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను అరికట్టేందుకు…వైరస్ వ్యాప్తి చెందకుండా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను  మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని  అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
 
దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటిలో 19 చెక్‌పోస్టులు ఇవాళ(శనివారం) అర్ధరాత్రి వరకు పనిచేయనున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు మూతపడనున్నాయి.

వీటితో పాటు నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
 
కరోనా దెబ్బకు ఇన్ఫోసిస్ బిల్డింగ్ ఖాళీ
కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్‌పాండే  తెలిపారు. 

ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగానే భవనాన్నిఖాళీ చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మోద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఏదైనా సమాచారం కోరకు తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలన్నారు. 1990 నుంచి ఉన్న విశాలమైన భవనంలో 12 రకాల కార్యాలయాలున్నాయి.
 
కరోనా  గురికాకుండా ఉండటానికి కర్నాటక ప్రభుత్వం ఈ టెక్ హబ్‌లోని అన్ని ఐటి, బయోటెక్ సంస్థలకు తమ ఉద్యోగులను ఒక వారం పాటు తమ ఇళ్ల నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అప్రమత్తం...కరోనా కోసం విదేశీయులపై డేగకన్ను