Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో సినిమా షూటింగ్స్​కు రెడ్​ సిగ్నల్​!

దేశంలో సినిమా షూటింగ్స్​కు రెడ్​ సిగ్నల్​!
, మంగళవారం, 17 మార్చి 2020 (07:45 IST)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో సినిమా షూటింగ్​లు నిలిపివేయనున్నారు. మార్చి 19 నుంచి 31వరకు ఈ నిబంధన అమలు కానుంది. తెలుగు పరిశ్రమ ఇదే బాటలో పయనించనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు వినోద రంగం నడుం బిగించింది.

సినిమా, టీవీ సీరియల్స్‌, డిజిటల్‌ షో ల షూటింగ్‌ను ఆపేయాలని దాదాపు అన్ని చిత్ర పరిశ్రమలు నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అదే బాటలో పయనిస్తోంది. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్‌ నిలిపివేసిన్నట్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ వెల్లడించాడు. 
 
ఇంటి చిట్కాలతోనే కరోనా నుంచి తప్పించుకోవచ్చట!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ముప్పు ఊహించినదానికంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. మనదేశంలో రెండోదశకు చేరడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. మొదటి దశలో విదేశాల నుంచి వచ్చిన భారతీయుల్లోనే ఇది బయటపడటం.. ఇటీవల వారి నుంచి ఇతరులకు వ్యాపించడం కలవరపెడుతోంది.

వైరస్‌ పూర్తిగా కొత్తది కావడం వల్ల ఇప్పటివరకు ఔషధాలు అందుబాటులో లేవు. ముందుజాగ్రత్తగా వైరస్‌ల బారినపడకుండా ఉండటం ఒక్కటే ప్రస్తుతం మనచేతుల్లో ఉంది. ప్రపంచాన్ని గజగజవణికిస్తోన్న కరోనా మన దేశానికీ వ్యాపించింది. 

కరోనాకు సంబంధించి ఇప్పటి వరకు ఔషధాలు, చికిత్స అందుబాటులో లేవు. వైరస్​ బారిన పడకుండా ఉండటం ఒక్కటే మనం చేయగలం. వైరస్‌కు లొంగకుండా మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే గాక... ఇంటి చిట్కాలతోనూ వైరస్‌ల నుంచి కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
 
కరోనా కోసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్లు
కరోనా వైరస్ వ్యాప్తి దేశం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో గతంలో విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో 100పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా 1075 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా 1800-112-545 నంబరుకు ఫోన్ చేసినా కరోనా గురించి సమాచారం అందజేస్తామని తెలిపింది.

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నంబర్లకు తోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని, వాటికి ఫోన్ చేసినా కరోనా గురించిన సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ లో కరోనా మృతుల కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం