Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో ఆసుపత్రిలో మణిరత్నం... గుండెపోటా? కాదు కాదంటున్న పీఆర్వో

దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణి

Webdunia
గురువారం, 26 జులై 2018 (16:43 IST)
దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణిరత్నం బాగానే వున్నారని ట్వీట్ చేశారు.
 
కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అపోలో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. కాగా ఇంతకుముందు ఓసారి మణిరత్నం గుండె సంబంధ సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లగానే అంతా అదేననుకుని వార్తలు రాశారు. ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం తన తదుపరి చిత్రం చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగులో నవాబ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments