Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అమ్మ' నైటీలో వుండబట్టే అప్పట్లో ఆ వీడియోను విడుదల చేయలేదు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి వీడియో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను తన అనుచరుడు అయిన వెట్రివేల్.. తన అనుమతి లేకుండా విడుదల చేశాడంటూ... టీటీవీ దినకరన్ అన్నారు. ఆర్కే నగర్ ఎన

Advertiesment
'అమ్మ' నైటీలో వుండబట్టే అప్పట్లో ఆ వీడియోను విడుదల చేయలేదు
, శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:10 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి వీడియో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను తన అనుచరుడు అయిన వెట్రివేల్.. తన అనుమతి లేకుండా విడుదల చేశాడంటూ... టీటీవీ దినకరన్ అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసిందంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దినకరన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు తెలియకుండానే ఈ వీడియో బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు. 
 
తన అనుచరుడు తనకు తెలియకుండానే ఈ వీడియోను మీడియా ముందు పెట్టినట్లు చెప్పారు. శశికళ జైలుకు వెళ్లే ముందు ఆ వీడియో తన చేతికి వచ్చిందని దినకరన్ చెప్పారు. విచారణ కమిషన్ కోరితే ఆ వీడియో సమర్పించేందుకు సిద్ధమని.. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో దీన్ని విడుదల చేయాలని మంత్రులు కోరినా... జయలలిత నైటీతో ఉన్న కారణంగా విడుదల చేయలేదన్నారు. కాగా, అప్పట్లో ఆర్కేనగర్ ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 
 
వెట్రివేల్ విడుదల చేసింది ప్రైవేట్ వీడియో అని, తాను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ''అమ్మ'' తీయమంటేనే రికార్డు చేశామని దినకరన్ వివరించారు. ఈ విషయం సీఎం పళనిస్వామి సహా అందరికీ తెలుసని తెలిపారు. కాగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పే వీడియోను వెట్రివేల్ విడుదల చేశారు. ఈ వీడియోలో జయలలిత జ్యూస్ తాగుతూ కనిపించింది. అయితే ఈ వీడియో అపోలోలో తీసింది కాదని.. అమ్మ నివాసమైన పోయెస్ గార్డెన్‌లో తీశారని ఆరోపణలున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించలేదనీ పెట్రోల్ పోసి తగలబెట్టాడు...