జయలలిత రక్తనమూనాలు మా వద్ద లేవు: అపోలో షాక్
బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చే
బెంగళూరుకు చెందిన అమృత (37) అనే మహిళ తాను జయలలిత కుమార్తెనని.. డీఎన్ఏ టెస్టు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో అమృత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అమృత డీఎన్ఎ పరీక్ష కేసు మలుపు తిరిగింది.
ఈ అంశంపై అమృత దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణ జరుపుతోంది. 2016 జయమ్మ అనారోగ్యంతో 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జయలలిత కుమార్తెనని అమృత నిరూపించుకోవాలంటే.. జయలలితకు సంబంధించిన బయోలాజికల్ నమూనాలు ఏవైనా సేకరించి ఉంచారా, లేదా అనే విషయంపై సమాచారం ఇవ్వాలని అపోలో ఆస్పత్రిని కోర్టు బుధవారం (ఏప్రిల్ 25) ఆదేశించింది.
కానీ అపోలో ఆస్పత్రి మాత్రం తమ వద్ద బయోలాజికల్ శాంపిల్స్ లేవని షాక్ ఇచ్చింది. ఇంతకుముందు.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి సీసీటీవీ దృశ్యాల గురించి కోరగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇదేవిధమైన సమాధానం చెప్పి అందర్నీ షాక్‌కు గురిచేసింది.