Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింల జనాభాపై తప్పుడు ప్రచారం : దిగ్విజయ్ సింగ్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:26 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి హిందువులు, ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు ఒకే విధంగా ఉంటుంద‌న్నారు. గతంలో వెల్లడైన గణాంకాల మేరకు 1951 నుంచి ముస్లింల్లో సంతానోత్ప‌త్తి రేటు హిందువుల‌తో పోలిస్తే అధికంగా త‌గ్గుతోందన్నారు. 
 
కానీ, ప్ర‌స్తుతం ముస్లింల్లో సంతాన సాఫ‌ల్య రేటు 2.7 శాతం కాగా, హిందువుల్లో ఇది 2.3 శాతంగా ఉంద‌ని.. 2028 నాటికి ఇది హిందూ, ముస్లింలలో స‌మానంగా ఉంటుంద‌ని దిగ్విజ‌య్ సింగ్ వ్యాఖ్యానించారు. 
 
ముస్లింల జ‌నాభా పెరుగుతోంద‌ని త్వ‌ర‌లో వారి జ‌నాభా హిందువుల‌ను అధిగ‌మిస్తుంద‌ని కొంద‌రు పేర్కొంటున్న నేప‌థ్యంలో దిగ్విజ‌య్ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేయడం గమనార్హం. 
 
ముస్లింల జ‌నాభా పెరుగుద‌ల గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటూ ఈ అంశంపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ స‌హా ఆరెస్సెస్ ప్ర‌చార‌క్‌ల‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు. ముస్లింల సంతానోత్ప‌త్తి రేటు త‌గ్గుతున్న‌ద‌ని, హిందువుల కంటే ముస్లింలు ఈ దేశంలో ఎన్న‌డూ మెజారిటీలు కాబోర‌ని తాను నిరూపిస్తాన‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments