Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ ఫెర్నాండెజ్ ఇకలేరు... మంగుళూరులో మృతి

ఆస్కార్ ఫెర్నాండెజ్ ఇకలేరు... మంగుళూరులో మృతి
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:52 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. మంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జులైలో ఇంటిలో యోగా చేస్తున్న సందర్భంగా ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది. వెంటనే ఆయనను ఐసీయూలో చేర్చారు.
 
గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన మంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలోనే ఉన్నారు. మృత్యువుతో పోరాటం చేస్తూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య బ్లోసమ్ ఫెర్నాండెజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.
 
కాగా, 1941 మార్చి 27న ఉడుపిలో ఆస్కార్ ఫెర్నాండెజ్ జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ గొప్ప ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. తొలినాళ్లలో ఎల్ఐసీ ఏజెంట్‌గా ఆస్కార్ ఫెర్నాండెజ్ పని చేశారు. ఆ తర్వాత మణిపాల్‌లో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.
 
ఇదేసమయంలో వ్యవసాయం కూడా చేశారు. వరిని పండించిన అత్యుత్తమ రైతుగా అవార్డును కూడా పొందారు. ఇదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమం, పెళ్లి చేసుకునేవారికి బంగారు తాళిబొట్టు, వెండిమట్టెలు