ఢిల్లీలో కాల్పుల కలకలం - కారులో నుంచి పారిపోయిన అల్లుళ్లు

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (08:44 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర ఢిల్లీలోని బారా హిందూరావ్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముజీబ్‌ అనే ప్రాపర్టీ డీలర్‌ ఈద్గా ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఈయన మేనమామకు రాణి ఝాన్సీ రోడ్డులోని ఫిలిమిస్తాన్‌లో ఓ క్లినిక్‌ ఉంది. గురువారం రాత్రి వారు క్లినిక్‌‌కు తాళం వేసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
 
క్లినిక్ షట్టర్‌కు తాళం వేసి వారిద్దరూ కారులో కూర్చోగానే.. ఓ యువకుడు వచ్చి వారి కారుకు అడ్డంగా నిల్చున్నాడు. అనంతరం మరో వ్యక్తి కూడా వచ్చాడు. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన మామా అల్లుళ్లు కారులో నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పారిపోయారు. 
 
అయినప్పటికీ దుండుగులు వారిని వదిలిపెట్టలేదు. వారిపై కాల్పులు జరపారు. అయితే, ఆ సమంయలో అటుగా వెళ్తున్న వారికి ఆ బుల్లెట్లు తగలడంతో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ఒకరిని గుర్తించామని, మరొకరు ఎవరనే విషయం ఇంకా తెలియలేదని వెల్లడించారు. కాగా, ఐదు నుంచి ఆరుగురు ఈ కాల్పులకు తెగబడ్డారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments