Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Advertiesment
ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం
, గురువారం, 8 జులై 2021 (19:06 IST)
ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో కార్యాయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.
 
ఈ కార్యాలయం లోథీ రోడ్‌లోవుంది. ఈ భవనంలోని సీజీవో సముదాయంలో మంటలు చెలరేగడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. 
 
అగ్నికీలలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ఘటన స్థలికి ఆరు ఫైరింజన్లను తరలించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్ పిల్లలు దొంగలు కాదు: విజయమ్మ భావోద్వేగం