Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ పిల్లలు దొంగలు కాదు: విజయమ్మ భావోద్వేగం

వైఎస్సార్ పిల్లలు దొంగలు కాదు: విజయమ్మ భావోద్వేగం
, గురువారం, 8 జులై 2021 (18:47 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
నాయకుడు అంటే వైఎస్సార్‌ని చూసి నేర్చుకోవాలని వై.ఎస్. విజయమ్మ చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అంటే ఎంత అభిమానం ఉందో.. ఈ రోజు మైక్‌ల ముందు చెప్పలేక పోవచ్చు కానీ, అందరి గుండెల్లో ఉన్నాడని అన్నారు.
 
షర్మిల కొత్త పార్టీ ఆవిష్కరణ సభలో విజయమ్మ భావోద్వేగంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వారు ఈ రోజు ఎంతో కపట ప్రేమ చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డిని దోషిగా ఎందుకు చూపించారని ప్రశ్నించారు. మమ్మల్ని రోడ్డు పైన పడేసిన మీరు వైస్సార్‌ని ఈ రోజు భుజాలపై ఎత్తుకుంటున్నారు... నాయకుడు అంటే భరోసా, ఒక ధైర్యం, నాయకుడు అంటే కొండను ఢీకొట్టే దమ్ము, ధైర్యం.
 
ప్రజల బ్రతుకు కోరే వారు నాయకుడు అంటే... దానికి నిలువెత్తు నిదర్శనం వైస్సార్ అని విజయమ్మ కొనియాడారు. నాయకుడు అంటే సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి, తెలంగాణ లోనే కాదు తెలుగు ప్రజల గుండెల్లో వినపడే కనపడే పేరు వైస్సార్ అన్నారు. రాజశేఖర్ రెడ్డికి వివక్ష అంటే తెలియదు... ఆయనకు కుటుంబం ఎంతో, సాధారణ ప్రజలు అంతే.

రాజశేఖర్ రెడ్డి చనిపోయారని తెలియగానే, ఆంధ్ర కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది చనిపోయారని విజయమ్మ చెప్పారు. కల్మషం లేని మనసు రాజశేఖర్ రెడ్డిది. ప్రతీ ఎకరాకి నీళ్లు ఇచ్చినప్పుడు నా జన్మ ధన్యం అని పదేపదే చెప్పేవారు. పల్లెలో జీవం తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అన్నారు.
 
ఆయన బాటలు వేసిన ప్రాజెక్టులు ఈ రోజుకి కూడా పూర్తి అవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డికి జగన్ బాబు అయినా, షర్మిల అయినా నిలువెత్తు వారసులని విజయమ్మ ప్రకటించారు. వీళ్ళు ఇద్దరు వారివారి ప్రయోజనాలకి ప్రతినిధులు.. నిజాయితీతో కూడిన విలువలకు ఆదర్శం మా షర్మిల పార్టీ అన్నారు.
 
తెలంగాణలో అసలు సిసలైన నాయకురాలు షర్మిల. షర్మిల రాజన్న ముద్దు బిడ్డ... రాజశేఖర్ రెడ్డి షర్మిలని యువరాణి లాగా పెంచుకున్నాడు. జగన్ పాదయాత్ర చేయాలి అని కోరినప్పడు షర్మిల చేసి చూపించారు. భారత దేశంలో షర్మిల లాంటి అమ్మాయిలు లేరని కొనియాడారు.
 
షర్మిల ఏ పని చేసిన సంకల్పంతో చేస్తుందని, వైస్సార్ రాక ముందు తెలంగాణ గడ్డ మీద రక్తం మరకలు ఉంటే, అదే నేల పైన నీళ్లు పారించిన ఘనడు వైస్సార్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండూ మనవే. అభిప్రాయ బేధాలు వస్తే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
 
రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు దొంగలు కాదు. గజ దొంగలు కానే కాదు. మాకు దాచుకోవడం, దోచుకోవడం తెలియదు. ఒక్క పంచడం తప్ప అన్నారు విజయమ్మ. రాజశేఖర్ రెడ్డి తన ప్రాణాలు కూడా ప్రజల కోసమే పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ ప్రైవేట్ భాగంలో బాటిల్ చొప్పించి గ్యాంగ్ రేప్, వీడియో తీసి షేర్