Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు వికృత చేష్టలు... దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య కన్నుమూత

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (15:45 IST)
ఓ యువకుడు వికృత చేష్టలకు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా హోసదుర్గం తాలూకా కొండాపురం గ్రామంలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యను అదే గ్రామానికి చెందిన వినయ్‌ అనే యువకుడు కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమెతో జరిపిన సంభాషణలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీన్ని గుర్తించిన ఆమె భర్త వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో వినయ్‌ కుటుంబ సభ్యులు బాధిత దంపతులపై కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయసాగారు. కేసు ఉపసంహరించుకోకుంటే చంపుతామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో ఫోన్‌లో వినయ్‌ కుటుంబం బెదిరింపులను రికార్డు చేశారు. 
 
వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టి అనంతరం తోణచేనహళ్లి శివారులోని వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. వాట్సాప్‌ మెసేజ్‌ గుర్తించిన శ్రీరాంపురం పోలీసులు వీరు ఉరేసుకున్న ఘటనా స్థలికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. 
 
అయితే అప్పటికే భర్త మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న భార్యను ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వినయ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments