భార్య ఉరివేసుకుంటే వీడియో తీసిన భర్త.. ఎక్కడ?

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

భార్య ఉరివేసుకుంటే వీడియో తీసిన భర్త.. ఎక్కడ?

Advertiesment
భార్య ఉరివేసుకుంటే వీడియో తీసిన భర్త.. ఎక్కడ?
, ఆదివారం, 9 జూన్ 2019 (09:11 IST)
కట్టుకున్న భార్య ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నా, ప్రమాదంలో చిక్కుకున్నా భర్త ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అవసరమైతే తన ప్రాణాలు అడ్డు వేస్తాడు. కానీ, ఈ భర్త మాత్రం భార్య పడక గదిలో ఉరి వేసుకుంటుంటే కిటికీలోనుంచి వీడియో తీస్తూ పైశాచికానందం పొందాడు. పైగా, తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు చెప్పాడు కూడా. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 2007లో సుంచు అరుణ (31), శ్రీనివాస్‌ (35) అనే దంపతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అరుణ తరచూ ఘర్షణ పడుతూ ఉండేది. 
 
ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్యా మరోమారు గొడవ జరుగగా, అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, అరుణ ముక్కు, నోటి నుంచి రక్తం కారడం, ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసుగా అనుమానిస్తూ, శ్రీనివాస్‌ను విచారించారు.
 
భార్య ఉరేసుకున్న తర్వాత, తానే ఓ కర్ర సాయంతో గది తలుపు తెరిచానని, ఆమెను కిందకు దించే సమయంలో కిందపడిందని, దాంతోనే ముఖంపై గాయాలు అయ్యుంటాయని శ్రీనివాస్ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓడిపోయినా... 2.88 లక్షల మంది ఆశీర్వదించారు : జనసేన లక్ష్మీనారాయణ