Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీధికుక్కలు చిరుతను మట్టుబెట్టాయి.. ఎలాగంటే?

Advertiesment
వీధికుక్కలు చిరుతను మట్టుబెట్టాయి.. ఎలాగంటే?
, గురువారం, 13 జూన్ 2019 (18:13 IST)
వీధికుక్కలు చిరుతను మట్టుబెట్టాయంటే నమ్ముతారా..? నమ్మితీరాల్సిందే. చిరుతను చూసి వీధికుక్కలు రెచ్చిపోయాయి. అంతేగాకుండా చిరుతను చుట్టుముట్టి కొరికేశాయి. ఈ ఘటనలో చిరుత ప్రాణాలు కోల్పోయింది. కేరళలోని కాల్పెట్టాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
దాదాపు పది శునకాలు చిరుతను చుట్టుముట్టాయి. ఆ శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు చిరుత ఎంతగానో పోరాడింది. కానీ ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా పది శునకాలు మీద పడి కరవడంతో తీవ్ర రక్త స్రావంతో చిరుత కిందపడిపోయింది. అయినా ఆ శునకాలు వదిలిపెట్టలేదు. 

చిరుతపులి చనిపోయే వరకూ అలా కరుస్తూనే వుండిపోయాయి. ఈ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి నిద్రలేపి శృంగారం చేద్దామా అంటాడు... వద్దంటే దాన్ని కోసేస్తాడు...