Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరాదిలో తమిళాన్ని అమలు చేస్తారా? హిందీని బలవంతం చేస్తే యుద్ధమే...

ఉత్తరాదిలో తమిళాన్ని అమలు చేస్తారా? హిందీని బలవంతం చేస్తే యుద్ధమే...
, సోమవారం, 3 జూన్ 2019 (11:41 IST)
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న త్రిభాషా విద్యా విధానం (హిందీ)పై దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు హిందీని బలవతంగా రుద్దాలని భావిస్తున్న కేంద్ర చర్యలను తీవ్రంగా ఖండించాయి. 
 
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నూతన విద్యా విధానంపై ఒక నివేదికను సమర్పించింది. ఇందులో త్రిభాషా విద్యా విధానం (ఇంగ్లీషు, మాతృభాష, హిందీ)ను అమలు చేయాలని సిఫారు చేసింది. ముఖ్యంగా హిందీని తప్పనిసరి చేస్తూ ఈ విద్యావిధానాన్ని తయారు చేసింది. దీనిపై కేంద్ర వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
తమపై హిందీని బలవంతంగా రుద్దితే సహించబోమని డీఎంకే అధినేత ఎక్ స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌లు హెచ్చరించారు. వీరితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యావేతేతలు, రచయితలు ఇలా పలు రంగాలకు చెందిన వారు హెచ్చరించారు. 
 
దీంతో కేంద్రం దిగివచ్చింది. ఇదే అంశంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని నూతన విద్యా విధానానికి సవరణలు చేస్తామని హామీఇచ్చారు. పైగా, అన్ని భాషలను కేంద్రం గౌరవిస్తుందని, ఎవరిపైనా హిందీని బలవంతంగా రుద్దాలని భావించడం లేదని చెప్పారు. కాగా, 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలో భాగంగా ఎన్.కస్తూరిరంగన్ ఆధ్వర్యంలో 9 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటి నూతన విద్యా విధానంపై ఓ నివేదికను రూపొందించి కేంద్రానికి సమర్పించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముక్క ముట్టని మొగుడు నాకొద్దు... విడాకులకు భార్య డిమాండ్