Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముక్క ముట్టని మొగుడు నాకొద్దు... విడాకులకు భార్య డిమాండ్

Advertiesment
ముక్క ముట్టని మొగుడు నాకొద్దు... విడాకులకు భార్య డిమాండ్
, సోమవారం, 3 జూన్ 2019 (11:08 IST)
ముక్క తినని మొగుడు తనకొద్దనే వద్దు అంటూ ఓ వివాహిత అడ్డం తిరిగింది. అంతేనా.. ఏకంగా భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాంసపు ముక్క తినని భర్త తనకు వద్దనే వద్దని తెగేసి చెప్పింది. ఈ విచిత్రకర సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన రమ్య, రఘు అనే యువతీయువకులకు ఆర్నెల్ల క్రితం వివాహమైంది. వీరిలో రఘు మాత్రం పూర్తి శాఖాహార కుటుంబ నేపథ్యంలో పుట్టిపెరిగాడు. కానీ, రమ్యకు మాత్రం ముక్కలేని ముద్దదిగదు. దీంతో ఆర్నెల్లుగా భర్తను కూడా మాంసాహారిగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ, ఆయన ససేమిరా మారలేదు. 
 
దీంతో గతవారం పోలీసుల వద్దకు వచ్చి.. తన భర్త మాంసాహారం తిడన లేదని, అటువంటి వ్యక్తి తనకు భర్తగా వద్దని తెగేసి చెప్పింది. పైగా, ఆయన తన అలవాటును మార్చుకుంటారని, మాంసాహారిగా మారుతారని తాను ఆర్నెల్లుగా ఎదురు చూశానని కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకొచ్చింది. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు తలలు పట్టుకున్నారు. 
 
చివరకు ఆ భార్యభర్తలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ రమ్య తన పట్టును వీడలేదు. ముక్క ముట్టని భర్త తనకు వద్దనే వద్దని తెగేసి చెపుతోంది. దీంతో పోలీసులు మరోమారు ఈ ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలని చూస్తున్నారు. అప్పటికీ రమ్య మారకుంటే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తను దుడ్డు కర్రతో కొట్టి చంపిన భార్య...