Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అదుపులోకి కరోనా ఉద్ధృతి

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (12:20 IST)
దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తాజా కేసుల సంఖ్య 1.5లక్షలకు దిగువన నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే క్రితం రోజు(1,27,510)తో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. క్రితం రోజు 2,795 మరణాలు సంభవిస్తే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది.
 
♦ తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832.
 
♦ గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో పోరాడుతూ 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,35,102.
 
♦ గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రకవరీలే అధిక సంఖ్యలో ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా 2,31,456 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది.
 
♦ ప్రస్తుతం దేశంలో 17,93,645 క్రియాశీల కేసులు ఉన్నాయి.
 
♦ గడిచిన 24 గంటల్లో 20,19,773 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 35 కోట్లకు చేరింది.
 
♦ దేశంలో ఇప్పటి వరకూ 21,85,46,667 టీకాలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments