Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భయపెడుతున్న కరోనా మూడో వేవ్.. మహారాష్ట్రలో 8000 చిన్నారులకి కరోనా!

భయపెడుతున్న కరోనా మూడో వేవ్.. మహారాష్ట్రలో 8000 చిన్నారులకి కరోనా!
, మంగళవారం, 1 జూన్ 2021 (12:35 IST)
కరోనా మహమ్మారి దేశ ప్రజలను ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుందో గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాము. తగ్గినట్టే తగ్గినా కేసులు ఒక్కసారిగా పెరిగి అధికారులకి, ప్రజలకి చుక్కలు చూపించాయి అని చెప్పవచ్చు. కేసులతో పాటు కరోనా మరణాలు కూడా భారీగా ఉండటం ప్రజలని, అధికారులని ఆందోళనకి గురిచేసింది.

గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించటంతో కేసులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. ఇప్పుడు రెండో వేవ్ కి ఇన్ని అవస్థలు పడుతుంటే, ఇలాంటి వేవ్ లు మరెన్నో రానున్నాయి అన్న వైద్యుల ప్రకటనలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
 
మన దేశంలో జనాభాకి అనుగుణంగా వైద్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చకపోవటం మరింత ఇబ్బందిగా తయారయ్యింది. మూడో వేవ్ లో చిన్నారులు ఎక్కువగా కరోనా బారిన పడతారు అన్న వైద్యుల హెచ్చరికలతో పిల్లల తల్లితండ్రులు భయం భయంగా కాలం గడుపుతున్నారు.

గత సంవత్సరానికి పైగా పిల్లలు ఇళ్లలోనే ఉండటంతో మానసికంగా కృంగిపోతున్నారు. ఇప్పుడు మూడో వేవ్ వారికే ప్రమాదకరం అని చెబుతుండటంతో తల్లితండ్రుల పరిస్థితి చెప్పలేని విధంగా ఉంది. దీనికి తోడు మహారాష్ట్రలో ఇప్పటికే మూడో వేవ్ మొదలయిందా అన్న అనుమానం వైద్య నిపుణుల్లో నెలకొంది. ఈ నెలలో మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో దాదాపు ఎనిమిది వేల మంది చిన్నారులు, టీనేజర్స్ కరోనా వైరస్ బారిన పడ్డారు.
 
కరోనా బారిన పడకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే కరోనా మూడవ వేవ్ ప్రభావం చిన్నారుల్లో చూపిస్తుందని నిపుణులు వెల్లడించిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడే మహారాష్ట్రలో మూడవ వేవ్ మొదలైపోయినట్లు తెలుస్తోంది. కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా దీనికి సిద్ధంగా ఉండాలి.

ఎక్కువ మంది చిన్నారులు కరోనా బారిన పడుతున్నారని.. కోవిడ్ ఆస్పత్రులని పిల్లల కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు అని… అవి ఒక స్కూల్ లాగ లేదా నర్సరీ లాగ ఉంటుందని అన్నారు. అహ్మద్ నగర్ లో ఎనిమిది వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని అయితే 10 శాతం కేవలం ఆ ఒక్క జిల్లాలోనే అని అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ లో కూడా మహారాష్ట్రలో అనేకమంది కరోనా బారిన పడటం, భారీ సంఖ్యలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మిగతా రాష్ట్రాలు మూడో వేవ్ కి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు-అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి