Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ. 4 లక్షల సాయం ఉత్తిదే..వైరల్ అవుతున్న ఉపసంహరణ ఉత్తర్వులు

రూ. 4 లక్షల సాయం ఉత్తిదే..వైరల్ అవుతున్న ఉపసంహరణ ఉత్తర్వులు
, శనివారం, 29 మే 2021 (13:20 IST)
కోవిడ్-19 బారినపడి మరణించిన వారి కుటుంబసభ్యులకు రాష్ట్ర విపత్తుల నివారణ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి రూ.4 లక్షలు ఆర్థిక సహాయంగా చెల్లించాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మళ్లీ అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని ఉపసంహరించుకుంది.

కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలు దీనిని విపత్తుగా ప్రకటించి బాధిత కుటుంబాలకు పరిహారంతో పాటు నిర్ధారణ పరీక్షలు, చికిత్స, ఇతర సదుపాయాలు కల్పించాలని కేంద్ర హోం శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పట్లోనే వెనక్కి తీసుకున్న ఈ ఉత్తర్వులు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఆర్ధిక సహాయం కోసం నిర్దేశిత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పంపుతున్నారు. అయితే, అసలు విషయం తెలియక చాలామంది నిజంగానే రూ.4 లక్షల పరిహారం లభిస్తుందని భావించారు.

ఎన్టీఆర్ఎఫ్ కింద చేపట్టే సహాయక పనుల్లో 75 శాతం నిధులను కేంద్రం, 25 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కరోనా మృతుల సంఖ్య భారీగా ఉండటంతో పరిహారం చెల్లింపు సాధ్యం కాదన్న భావనతో కేంద్రం ఈ ఆదేశాలను ఉపసంహరించుకుందని అధికారవర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలన్న అంశంపై దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనందయ్య కరోనా మందు ఎఫెక్ట్: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో 80 మంది రోగులు