Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘తబ్లిగి’ కేసుల్ని త్వరగా తేల్చండి.. ట్రయల్‌ కోర్టులకు సుప్రీం ఆదేశం

‘తబ్లిగి’ కేసుల్ని త్వరగా తేల్చండి.. ట్రయల్‌ కోర్టులకు సుప్రీం ఆదేశం
, బుధవారం, 4 నవంబరు 2020 (08:54 IST)
వీసా ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ తబ్లిగి జమాత్‌ సభ్యులపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ట్రయల్‌ కోర్టులను ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిజాముద్దీన మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన విదేశీ తబ్లిగి జమాత్‌ సభ్యులను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లను న్యాయమూర్తులు ఎ.ఎం. ఖన్విల్కర్‌, దినేష్‌ మహేశ్వరి, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం జాబితా చేసింది.

సదరు కేసులను త్వరితగతిన విచారించాలని దిగువ కోర్టులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబరు 20వ తేదీకి వాయిదా వేసింది. కొంతమంది జమాత్‌ సభ్యుల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి మాట్లాడుతూ.. ఎనిమిది మంది జమాత్‌ సభ్యులను విడుదల చేయాలని కోరుతూ నవంబరు 10న ట్రయల్‌ కోర్టుల ముందు పిటిషన్‌లు దాఖలైనట్లు తెలిపారు.

మరో సీనియర్‌ న్యాయవాది సి.యు. సింగ్‌ మాట్లాడుతూ జమాత్‌లోని కొంతమంది విదేశీ సభ్యులను డిశ్చార్జ్‌ చేసిన కేసుల్లో అధికారులు సవరణలు కోరినట్లు చెప్పారు. కాగా ఇటువంటి పిటిషన్లను కోర్టులు త్వరగా పరిష్కరించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ”ఇది వారికి శిక్షగా మారింది, పునర్విమర్శ దరఖాస్తులు దాఖలు చేసిన తరువాత కూడా వారిని తిరిగి తమ దేశాలకు వెళ్లడానికి అనుమతించడం లేదు” అని సింగ్‌ పేర్కొన్నారు.

వీసా ఉల్లంఘన ఆరోపణలపై 13 మంది విదేశీ తబ్లిగి జమాత్‌ సభ్యులపై ట్రయల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసులను బదిలీ చేయమని కోరిన బీహార్‌ ప్రభుత్వాన్ని పాట్నా హైకోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది.

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ..న్యూఢిల్లీలో జరిగినట్లుగా విచారణను ఏకీకతం చేయవచ్చని, అక్కడ ఇటువంటి కేసుల విచారణ జరుగుతున్న సాకేత్‌ కోర్టులో విచారణ జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 11 రాష్ట్రాలు విదేశీ తబ్లిగి జమాత్‌ సభ్యులపై 205 ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాయి. ఇప్పటివరకు 2,765 మందిని బ్లాక్‌ లిస్ట్‌ చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. వీరిలో 2,679 మంది విదేశీయుల (9 ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసిఐ) కార్డుదారులతో సహా) వీసాలు రద్దు చేయబడగా, మిగిలిన 86 మందిలో వీసా అవసరం లేని నేపాల్‌ జాతీయులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణకు లాభాలు అప్పగించి, ఏపీఎస్ ఆర్టీసీకి నష్టాలు: టీడీపీ