Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొల్లాచ్చిపై పోస్టు వైరల్.. ఆ సమయంలో అమ్మను హత్తుకుని ఏడవాలనిపించింది..

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (16:30 IST)
పొల్లాచ్చిలో ఓ యువతిపై జరిగిన లైంగిక దాడి ప్రస్తుతం తమిళనాట కలకలం సృష్టించింది. పొల్లాచ్చి లైగింక దాడికి సంబంధించి కోవైకి చెందిన యువతి ఫేస్‌బుక్‌లోని పోస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కోవై జిల్లా, పొల్లాచ్చిలో 100 మందికిపైగా లైంగిక వేధింపులకు గురిచేసి.. వీడియో తీసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ బాధితురాలి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. 
 
ఆ వీడియోలో బాధితురాలి గోడును వినలేక.. మహిళా సంఘాలు, ప్రజలు, రాజకీయ నేతలు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠినమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా రాజకీయ ప్రతినిధులు రేపిస్టులకు కఠినమైన శిక్ష పడాలని, నడిరోడ్డుపై వారి ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కోవైకి చెందిన నర్మదా మూర్తి అనే యువతి తన ఫేస్ బుక్ అకౌంట్‌లో.. పొల్లాచ్చి లైంగిక దాడికి సంబంధించి రాసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఆమె రాసిన ఆ పోస్టులో ఏముందంటే? ''నేను కోయంబత్తూరుకు చెందిన అమ్మాయిని. పొల్లాచ్చి ఘటనకు తర్వాత.. ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా వుండు. బాయ్ ఫ్రెండ్స్‌ వద్దు.. వంటి సలహాలే తల్లిదండ్రులు ఇస్తారనుకున్నా. అయితే నాకు ఫోన్ చేసిన అమ్మగారు.. ధైర్యంగా వుండు. ఏం జరిగినా మేం నీ వెంటే వుంటాం. ఏదైనా ఫోటో లేదా వీడియోతో నిన్ను బెదిరిస్తే.. భయపడకు. ధైర్యంగా ముందుకెళ్లు. ప్రపంచంలోని అందరి మహిళలకూ ఈ శరీరం వుంది. ఇందుకోసం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిన తల్లిదండ్రులు నీకు అండగా వుంటాం'' అని చెప్పినట్లుంది.
 
ఇలా అమ్మ మాట్లాడటం విన్న తాను ఆ సమయంలో అమ్మను హత్తుకుని బోరున ఏడ్వాలనిపించిందని నర్మదా మూర్తి ఆ పోస్టు ద్వారా వెల్లడించింది. ఇలా తల్లిదండ్రులు అమ్మాయిలకు అండగా వుండాలని.. అమ్మాయిలు ధైర్యంగా వుండాలని నర్మదా మూర్తి పిలుపునిచ్చింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం