Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజం చెప్తే.. వారి పరువు పోతుంది... ప్రియా ప్రకాష్ వారియర్

Advertiesment
నిజం చెప్తే.. వారి పరువు పోతుంది... ప్రియా ప్రకాష్ వారియర్
, మంగళవారం, 12 మార్చి 2019 (15:03 IST)
మలయాళ చిత్రం ఒరు ఆదార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చిత్ర దర్శకుడు ఒమర్ లులు, సహనటి నూరిన్ షెరీఫ్ ప్రియా వారియర్‌పై సంచలన కామెంట్‌లు చేసారు. కన్నుగీటుతో ప్రియా ప్రకాశ్‌కి వ‌చ్చిన క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు స్క్రిప్ట్ మార్చమ‌ని బ‌ల‌వంతం చేసారని, అలాగే సినిమాలో నూరిన్‌నే హీరోయిన్‌గా అనుకున్నట్లు దర్శకుడు ఒమర్ లులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
 
ఈ చిత్రంలో లీడ్ రోల్‌ని సపోర్టింగ్ రోల్ చేసారని, సపోర్టింగ్ రోల్‌ను చేయడం బాధ కలిగించిందని నూరిన్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రియా వారియర్‌తో కలసి ఇకపై నటించనని తెగేసి చెప్పింది. ప్రియా వారియర్ మూలంగా తన కెరీర్ చాలా లాస్ అయినట్లు పేర్కొంది.
 
ఈ వివాదం రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో మీడియా ఇదే విషయాన్ని ప్రియా ప్రకాశ్‌ని ప్రశ్నించగా, అసలు ఏమి జరిగిందో చెబితే తనను విమర్శించే వారి పరువు పోతుందని, అలాగే తనను విమర్శించే వారికి కాలమే సమాధానం చెబుతుందని ప్రియా పేర్కొంది. 
 
ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రియా ప్రకాశ్ మ్యాజిక్ సినిమాను గట్టెక్కించలేకపోయిందన్న మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్... 14న అన్నింటికీ బ్రేక్ వేస్తానంటున్న రాజమౌళి