Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియా వారియర్‌కి అంత సీన్ లేదు.. ఒమర్ లులు

Advertiesment
ప్రియా వారియర్‌కి అంత సీన్ లేదు.. ఒమర్ లులు
, సోమవారం, 11 మార్చి 2019 (15:25 IST)
'ఒరు అడార్ లవ్' సినిమాలోని ఒక పాటలో కన్నుగీటే ప్రియా ప్రకాష్ వారియర్, కన్నుగీటే ఒకే ఒక్క సన్నివేశంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోవడంతో... ఆ సినిమా విడుదలకు ముందే ఆమెకు భారీ పాపులారిటీని సాధించేసింది. దీంతో అప్పటిదాకా జరిగిన స్క్రిప్ట్ పనుల్లో మార్పులు చేసి ప్రియానే లీడ్ రోల్‌గా చేసేస్తూ దర్శక నిర్మాతలు సినిమాను తెరకెక్కించారట. అయితే తెలుగు, మలయాళ భాషల్లో ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో ప్రియాపై పెట్టుకున్న అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి.
 
కాగా, ఆ సినిమా దర్శకుడు ఒమర్ లులు.. సినిమా ఫెయిల్యూర్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కానేకాదని స్పష్టం చేసిన ఆయన, ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో కన్నుకొట్టే సన్నివేశంతో ఆమె సెన్సేషన్ కావడంతో చిత్ర నిర్మాతలు ప్రియానే లీడ్ రోల్‌లో ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని బలవంత పెట్టారని వెల్లడించారు. 
 
ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ వేరేననీ, ఒక యువ జంట మర్డర్ నేపథ్యంలో తాను స్క్రిప్ట్ రాసుకుంటే.. ప్రియా ప్రకాష్ హైలైట్ అయ్యేలా నిర్మాతలు అందులో మార్పులు చేయించారనీ ఆయన పేర్కొన్నారు. చిత్రంలో మరో రోల్ పోషించిన న్యూరిన్ షరీఫ్.. ప్రియా కంటే బెస్ట్ యాక్ట్రెస్ అనీ ఆయన అన్నారు.
 
గతంలో న్యూరిన్ షరీఫ్ కూడా సినిమాలోని తన పాత్రపై ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఒమర్ లులు తనను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డానని, అయితే ప్రియా ఓవర్ నైట్ స్టార్ కావడంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేసి సినిమాలో తనకు ప్రాధాన్యత తగ్గించడం బాధపెట్టిందనీ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణజింక కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు