Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

12 యేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వృద్ధుడు

12 యేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన వృద్ధుడు
, సోమవారం, 11 మార్చి 2019 (17:53 IST)
హైదరాబాద్‌లో జరిగే నేరాల జాబితా పెరిగిపోతోంది. నగరంలో కనీసం రోజుకో నేరమైనా జరుగుతోంది. ఇందులో అత్యాచార ఘటనలే ఎక్కువ. వృద్ధులు కూడా మనుమరాలు వయసున్న వారిని వదలటం లేదు. ఇదే విధంగా అత్యాచారానికి ఒడిగట్టిన 50 ఏళ్ల వ్యక్తిని స్థానికులు చితకబాదారు.
 
సికింద్రాబాద్ సమీపంలో ఉన్న అల్వాల్ ఏరియాలో కూలీ పనులు చేస్తూ బతికే దశరథ్ అనే 50 ఏళ్ల వ్యక్తి పక్కింట్లో ఉండే 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుండి కేకలు వినిపించడంతో చుట్టుప్రక్కల వారు అక్కడికి వెళ్లారు. ఏమి జరిగిందని అతడిని ప్రశ్నించగా చాక్లెట్ కోసం మారాం చేస్తుంటే మనుమరాలిని కొట్టానని చెప్పాడు. 
 
అనుమానం వచ్చి, గాయపడి ఏడుస్తున్న పాపను అడగగా అసలు విషయం చెప్పింది. అందరూ కలిసి అతడిని చితగ్గొట్టి బడతపూజ చేశారు. పోలీసులకు సమాచారం అందించి అతడిని వారికి అప్పగించారు. బాలికను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు బాలిక పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహన్ లాల్‌కు అత్యున్నత పద్మభూషణ్ అవార్డ్..