ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (09:36 IST)
కొందరు మహిళలు తమ భర్తలు ఇచ్చే శారీరక సుఖం చాలక పరాయి పురుషులు లేదా తమకంటే వయసులో చిన్నవారిగా ఉండే యువకులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తమ అక్రమ బంధానికి అడ్డుగా వచ్చే భర్తలను చంపేస్తున్నారు. మరికొందరు మహిళలు అయితే, కుటుంబ గౌరవ మర్యాదలు, తమ పిల్లల జీవితాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమకు నచ్చిన పరాయి పురుషుడుతో లేచిపోతున్నారు. తాజాగా 36 యేళ్లు మహిళ, ముగ్గురు పిల్లల తల్లి 16 యేళ్ల ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువకుడుని రక్షించారు. 
 
నాగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో పొరుగింటి యువకుడుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా ఆలయాలకు వెళ్లుతుండేవారు. దీంతో వారిమధ్య ప్రేమ బంధం మరింతగా గట్టిపడటంతో ఓ రోజున ఆ మహిళ తన ముగ్గురి పిల్లలను వదిలిపెట్టి యువకుడుతో లేచిపోయింది.
 
ఆ యువకుడు తల్లిదండ్రులు తమ పిల్లోడి గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెల్సిందే. ఆ తర్వాత వారి ఆచూకీ తెలుసుకుని యువకుడుని రక్షించారు. మైనర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు గాను ఆ మహిళపై వివిధ సెక్షన్ కింద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments