కొందరు యువతీ యువకులు వివాహేతర సంబంధాలు కొనసాగించేందు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ అక్రమ బంధానికి ఎవరైనా అడ్డొస్తున్నారంటే వారిని హతమార్చేందుకు సైతం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని అక్కను, అమ్మను తన ప్రియుడుతో కలిసి ఓ యువతి హత్య చేయించింది.
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్క, అమ్మను ప్రియుడితో కలిసి చంపి మృతదేహాన్ని మురికి నీటి సంపులో పడేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని నార్త్ లాలాగూడలో జరిగింది.
ఈ ప్రాంతానికి చెందిన సుశీలకు నలుగురు సంతానం. రెండో కుమార్తె లక్ష్మీకి అరవింద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం గురించి తెలుసుకున్న తల్లి సుశీలను, అక్క జ్ఞానేశ్వరిని హత్యం చేసి మురికినీటి సంపులో యువతి ప్రియుడు పడేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నీటి సంపులో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.