Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

No mangalsutra, bindi? మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం లేదు.. నీపై భర్తకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది?

Advertiesment
mangalsutra

సెల్వి

, శుక్రవారం, 7 మార్చి 2025 (14:07 IST)
mangalsutra
మహిళలు ఆధునికత పేరుతో దుస్తులు ధరించడం ఫ్యాషనైపోయింది. ఫ్యాషన్ పేరిట నుదుట సింధూరం ధరించడం, మంగళసూత్రం ధరించడం కూడా పక్కనపెట్టేస్తున్నారు చాలామంది. మంగళసూత్రాన్ని దాచేయడం.. నుదుటన చిన్న స్టిక్కర్లు వాడటం.. కొందరైతే ఆ చిన్నపాటి బొట్టు పెట్టడం కూడా వదులుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పూణే కోర్టు ఓ కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కోర్టుకెక్కింది. భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా భార్యాభర్తలు పూణే జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ వ్యహారంలో జడ్జి కీలక వ్యాఖ్యలు చేసి ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నం చేశారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఇంకా జడ్జి చేసిన వ్యాఖ్యల్లో ఏమున్నాయంటే.. "మెడలో మంగళసూత్రం లేదు, నుదిటిపై బొట్టు కూడా లేదు. మీరు ఒక వివాహితగా ప్రవర్తించకుంటే అలాంటప్పుడు మీ భర్తకు ఎలా మీపై ఇంట్రెస్ట్ వస్తుంది? ఒక మహిళ బాగా సంపాదిస్తే తనకన్నా ఎక్కువగా సంపాదించే మగాడిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. తనకన్నా తక్కువ సంపాదించే మగాడితో సంసారం చేయాలని కోరుకోదు. 
 
అయితే పురుషుడి విషయంలో అలా వుండదు. బాగా సంపాదించే మగాడు వివాహం చేసుకోవాలి అనుకుంటే.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. పురుషులు అలా ఫ్లెక్సిబుల్‌గా వున్న పక్షంలో మహిళలు కూడా కాస్త మారాలి. మొండిగా కఠినంగా వుంటే ఎలా అంటూ జడ్జి ప్రశ్నించారు. 
 
దీంతో జడ్జి వ్యాఖ్యలు విని ఆ మహిళ షాక్ అయింది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ వుంది. కానీ వివాహిత లాయర్ అంకుర్ జవాగిర్దార్ జడ్జి వ్యాఖ్యలను తప్పుబట్టారు. జడ్జి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన లింక్డ్ ఇన్‌లో పోస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ మెగా రాకెట్ ప్రయోగం సక్సెస్.. కానీ గాల్లోనే పేలిపోయింది.. (video)