Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానంలో మహిళ ప్రయాణికురాలి వికృత చేష్టలు!

Advertiesment
flight

ఠాగూర్

, శుక్రవారం, 7 మార్చి 2025 (11:31 IST)
విమానంలో ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అమెరికాలోని హ్యూస్టన్‌ నుంచి ఫీనిక్స్ వెళుతున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఆమె ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం... 
 
హ్యాస్టన్‌లోని విలియమ్ పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టైకాఫ్ అవుతుండగా, ఓ మహిళ బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. తన దుస్తులు తొలగించి పెద్దగా అరుస్తూ అటూ తిరగడం ప్రారంభించింది. తన దుస్తులు తొలగించి, పెద్దగా అరుస్తూ అటూఇటూ తిరగడం ప్రారంభించింది. కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్ళి, దానిని బాదుతూ తనను దించేయాలని డిమాండ్ చేసింది. 
 
సుమారు 25 నిమిషాల పాటు ఆమె ఇలాంటి చేష్టలకు పాల్పడిందని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు దాంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఒంటిపై దుప్పటికప్పి, ఫ్లైట్ దించేసి హ్యాస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించిటన్టు తెలుస్తోంది. తర్వాత ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనతో తాము ఆందోళనకు గురయ్యారని ప్రయాణికులు తెలిపారు. ఆమె ప్రవర్తనతో మేం తీవ్ర అసౌకర్యానికి ఎదుర్కొన్నాం. భయపడిపోయాం అన్నారు. ఈ ఘటనకు కారణంగా 90 నిమిషాల ఆలస్యంతో విమానం గమ్యస్థానానికి బయల్దేరింది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్టు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

YS Jagan: తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్ దాఖలు