Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మపుత్ర నదిపై భారీ విద్యుత్ ప్రాజెక్ట్.. చైనా గ్రీన్‌సిగ్నల్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:18 IST)
Bramhaputra
అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర నది మీద భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 60 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన 14వ పంచవర్ష ప్రణాళికను ఆ దేశ పార్లమెంట్‌ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ ఆమోదించింది. 
 
చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన "త్రీ గోర్జెస్" డ్యామ్‌ ప్రపంచంలోనే భారీ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మపుత్రపై నిర్మించనున్న ఈ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్లాంట్‌లో "త్రీ గోర్జెస్" కంటే మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
 
టిబెట్ అటానమస్ రీజియన్ (టార్)లో యార్లంగ్‌ జాంగ్‌బోగా, అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్‌గా, అసోంలో బ్రహ్మపుత్రగా ఈ నది ప్రవహిస్తోంది. టిబెట్‌లో పుట్టిన ఈ నది 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్, బంగ్లాదేశ్‌లలో నీటి అవసరాలను తీరుస్తోంది. ఈ నది ఎగువ భాగంలో ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కూడా కన్నేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments