బాలికపై బాక్సింగ్ కోచ్ అత్యాచారం: నిజం చెప్పావో నీ కెరీర్ నాశనం చేస్తానంటూ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:04 IST)
మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో బాక్సింగ్ కోచ్ అరెస్టయ్యాడు. 30 ఏళ్ల బాక్సింగ్ కోచ్‌ను ముంబైలోని తిలక్ నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మైనర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడని, తను అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని కూడా బెదిరించాడని బాధితురాలు తెలిపింది.
 
నిందితుడిని గురువారం మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచి పోలీసు కస్టడీలో ఉంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తిలక్ నగర్‌లోని అథ్లెటిక్ క్లబ్‌లో బాక్సింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతడు తర్ఫీదునిస్తున్న బాలిక కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. అంతేకాదు తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు.
 
ఈ క్రమంలో మార్చి 7న నిందితుడు, మైనర్ ఇద్దరూ కలిసి ములుంద్‌లోని క్లబ్‌లోని మరో శాఖకు వెళ్లినప్పుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ములుంద్‌లోని క్లబ్‌లో నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడని, బాక్సింగ్‌లో తన కెరీర్‌ను పాడు చేస్తానని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కాలే తెలిపారు.
 
మైనర్ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. ఆ తరువాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని 376 (అత్యాచారం), 376 (3) (16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు), అలాగే లైంగిక నేరాల చట్టం కింద కేసులు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం