Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయింటర్ ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ రమ్మీ

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (11:55 IST)
ఆన్‌లైన్ రమ్మీ ఓ పెయింటర్ ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, మనలి, అన్నా వీధికి చెందిన నాగరాజన్ (37) పెయింటింగ్ కార్మికులతో పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తున్నాడు.
 
అయితే ఈయన కొన్నాళ్లుగా ఆన్ లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ వరుసగా డబ్బులు కోల్పోయాడు. అయితే కోల్పోయిన డబ్బులను ఎలాగైనా మళ్లీ సంపాదించాలనే పట్టుదలతో భార్య నగలు తాకట్టు పెట్టి, అప్పులు చేసి ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 20 లక్షల వరకు కోల్పోయాడు. 
 
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆన్ లైన్ రమ్మీ వద్దని బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి హితవు పలికారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం కూడా తన సెల్ ఫోన్ అమ్మి నాగరాజన్ రమ్మీ ఆడి, ఈ డబ్బు కూడా కోల్పోయాడు. 
 
ఈ పరిస్థితుల్లో నాగరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments